Yudit FAQ

Languages

The FAQ below is expected to detect your browser language.

You can override this by selecting from the following list of language codes:

Bulgarian (bg), Czech (cs), German (de), English (en), Spanish (es), Finnish (fi), Hungarian (hu), Italian (it), Japanese (ja), Korean (ko), Russian (ru), Serbian (sr), Telugu (te), Vietnamese (vi), Yiddish (yi), Chinese/Hongkong (zh)

Telugu FAQ

వైయుడిట్ యూనికోడ్ ఎడిటొర్ తరచుగా అడిగే ప్రశ్నలు
========================
వర్శన్: ౨.౮.౧
రచయత: గాశ్పర్ సినాయి <gaspar (at) yudit.org> 
స్తలము మరియు తేది: టోక్యో ౨౦౦౩-౦౬-౨౫

తెలుగు అనువాదకుడు: కృష్ణ దాస కవి రాజు <krsnadasakaviraju (at) yahoo.com>
స్తలము మరియు తేది: హైదరాబాదు ౨౦౦౪-౦౬-౦౨

ప్రశ్న ౧: ఈ తరచుగా అడిగే ప్రస్నలు మరళ నేను ఎలా ప్రదర్శించగలను?
జవాబు ౧: 'help' అని కమాండ్ ప్రదేశములో టైపు చెయ్యగలరు. (బహుశ ఇది మీకు ఇంగ్లీషు లో ఈ తరచూ అడిగే ప్రశ్నలు ప్రదర్శించవచ్చు-అనువాదకుడు). అలాగే మీరు 'test' ని కమాండ్ ప్రదేశము లో టైపు చేసి పరిక్ష కాగితము పొందవచ్చు. ఇంకా 'howto japanese', 'howto configure'  అని టైపు చేసి ఎల చేయడము అను కాగితములు పొందవచ్చు. 

ప్రశ్న ౨: తరువాతి వర్శన్లకు ఎలా మెరుగు పరచగలను?
జవాబు౨: http://www.yudit.org/ నుండి మీరు దిగుమతి చేసుకొనండి. 

ప్రశ్న౩: నేను దాచిపెట్టు (సేవ్) మీఠ నొక్కినాను, కాని ఏమీ జరగలేదు. ఎందుకని?
జవాబు౩: వైయుడిట్ కి కమాండు లిను కలదు, మీరు ఎంటరు మీఠ నొక్కవలెను అనుకుంట. 

ప్రశ్న౪: సాదారణముగా "Unix" ("యునిక్ష్") అని చూపిస్తూ కుడివైపు గల ఆ [లైను విరామము]  ఏమిటి? 
జవాబు౪: లైను విరామ గుర్తులు: 
యునిక్ష్= '\n' - యునిక్ష్ లైను విరామము
డాస్= '\r\n' - డాస్ లైను విరామము
మాక్='\r'-మాక్ లైను విరామము
యెల్ యెస్ = యూ + ౨౦౨౮ - యూనీకోడ్ లైను విరామము
పి యస్ = యూ + ౨౦౨౯ - యూనీకోడ్ పరాగ్రాఫు విరామము
వైయుడిట్ నన్ందు మీరు వీటిని కలపవచ్చు- ఉదాహరణకు మీరు డాస్ మరియు యునిక్ష్ రెండు రకాల లైను విరామములు గల ఫైలు సృష్టించవచ్చు, కాని ఇలా కలపడము సాద్యమైనంతవరకు చేయవద్దు

ప్రశ్న౫: వివిధ సంకేతీకరణల వివరములు పొందడము ఎలా? (-e ఎంపిక)
జవాబు౫:మీ లైనక్షు పెట్టలో 'man uniconv' లేదా 'uniconv -h'  అని ఏదో ఒక షెల్ లో టైపు చెయ్యండి.

ప్రశ్న౬: నెను నా స్వంత కీబోర్డ్  లోపలి సమాచార ఫైలు ఎలా కలప గలను?
జవాబు౬: మీ ఫైలు /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/data లో ఉండవచ్చు, 
 in this case you just need to add this to 
ఇటువంటి స్థితిలో ఆ సమాచరాన్ని /home/మీ_యూజర్ పేరు_/Test/share/yudit/config/yudit.properties కు కలపగలరు. అలా కాకున్న, మీరు sourcd kmap ఫైలు ని ద్విపద నిర్మాణము లోనికి మార్చవలెను. దీని కోసము ఈ క్రింది కమాండు ఉపయోగించండి
    mytool -type kmap -kmap My.kmap -rkmap My.kmap  -write My.my
ఆ తరువాత  కాపీ చెయ్యండి     cp My.my ~/.yudit/data
Note that kmap files can be used as text converters and font maps too.
దయచేసి ఆ kmap souce ఫైలు ని నాకు పంపించగలరు, తరువాతి పంపకములో నేను కలుపుతాను. ఈ kmap ఫైలు గురించిన మరింత సమాచారము కొరకు /usr/share/yudit/doc/keymap-format.txt ని చూడగలరు. వైయుడిట్ తో పాటు వచ్చే kmap ఫైల్ల మూల కోడ్ కొరకు /usr/share/yudit/src/ ని చూడగలరు. 
గమనిక: kmap ఫైల్లు వచన మార్పిడిగా మరియు పదరూపము మ్యాపు చెయ్యడానికి కూడా ఉపయోగపడతాయి

ప్రశ్న౭: నా స్వంత భాష లో సమాచారము ఎలా చూడగలను?
జవాబు౭: మూల కోడ్ ని దిగుమతి చేసుకోని దానిలోని README.TXT (రీడ్ మీ . టెక్ష్ట్ ) ని చదవండి. అది మీకు ఎలా  చెయ్యాలో చెపుతుంది. దయచేసి నాకు అనువాదములు పంపించండి, వాటిని భవిష్యత్తు వర్షన్ పంపకములలో ఉంచగలను. 

ప్రశ్న౮: నేను ఒక ట్రూ టైపు పదరూపము ఎలా కలపగలను?
జవాబు౮: font-file.ttf మరియు ఇతర టి టి యఫ్ ఫైలులను 
    /usr/share/yudit/fonts or ~/.yudit/fonts
నందు ఉంచగలరు ఆ తరువాత ఒక కొత్త కాల్పనిక పదరూపము కలుపుతూ
    /usr/share/yudit/config/yudit.properties
ని మార్చగలరు. ఉదాహరణకు 
    yudit.font.MyFont=font-file.ttf,some-other-fontfile.ttf,..
    yudit.editor.fonts=...,MyFont,... అని కలిపిన లేదా yudit.fonts=....,MyFont,...అని కలిపిన మీరు ఈ పదరూపము ని ఉపయోగించగలరు

ప్రశ్న౯: విండోస్ వర్సన్ ఎక్కడ వుంది? 
జవాబు౯: వైయుడిట్ సిటు నందే మీకు విండోస్ వర్సన్ లింకు (కలయిక ) వుంటుంది, కాని అది కొత్త వర్సన్ కాక పోవచ్చు. (ఈ జవాబు ఇంగ్లీషు FAQ కి బిన్నమైనది - అనువాదకుడు)

ప్రశ్న౧౦: వైయుడిట్ ఎంత మంచి యూనికోడ్ ఎడిటరు? 
జవాబు౧౦: ఎక్కడైతే బాగుంది అనిపించినదో అక్కడ నేను యూనికోడ్ ప్రమాణము అమలు చేసినాను, కాని అక్కడక్కడ కొన్ని తేడాలు వునాయి. దయచేసి   ఇరువైపులనుండి (కుడినుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి -ఉర్దూ లాగా)వ్రాయు విషయముల కొరకు  /usr/share/yudit/doc/HOWTO-bidi.txt  ని చదవగలరు.

ప్రశ్న౧౧: నేను కమాండు గీత లో ౩ ఫైల్లు నిర్దేశించినాను కాని నాకు ఒకటే ఫైలు కనిపిస్తున్నది. ఎందుకు? 
జవాబు౧౧: అవి చరిత్ర లో తాత్కాలికముగా ఉనాయి. మీకు కావలెనన్న కమాండు లోకిని వెల్లి, పై బాణము(Ctrl -k , కంట్రోలు కె) మరియు క్రింది బాణము(ctrl j కంట్రోలు జె) ఉపయోగించవచ్చు. 

ప్రశ్న౧౨: హాట్ కీ బైండింఘులు (hot-key bindings ) ఏమిటి? 
జవాబు౧౨: You can see most of them - the yellow tooltip shows them 
 underlined. Most of them should work with Ctrl as well as Alt keys.
 The pluggable editor currently has the following keybindings:

 Escape - కమాండు విధము మరియు ఎడిటర్ విధము మధ్య మారడానికి ఉపయోగ పడుతుంది. 
 Home - లైను మొదటికి వెళ్ళడానికి 
 End - లైను చివరకు వెళ్ళడానికి 
 b - కాగితము పైకి
 f - కాగితము క్రిందకి
 k - పైకి
 n,j - క్రిందకి
 h - ఎడమకు
 l - కుడివైపునకు
 m - లైను మొత్తము తొలగించండి
 x - ఎన్నుకొనబడినది తొలగించండి
 v - చివరగ ఎన్నుకొనబడినది అతికించండి
 If Meta is kept down while moving the caret, the text will be selected.
 Mouse double click selects a word triple click selects a full line.

ప్రశ్న౧౩: నేను ద్విపద కీమ్యాపు (binary kmap) ఫైలు ని ఎలా చదవగలను? 
జవాబు౧౩: మీరు ఈ క్రింది విధముగా మూల కోడు ని చూడగలరు. 
 mytool -my /usr/share/yudit/data/GreekBible.my \
      -convert mys -write GreekBible.mys

ప్రశ్న౧౪: నేను ఒక యూనికోడ్ అక్షరాన్ని ఎలా త్వరగా ప్రవేశపెట్టగలను? 
జవాబు౧౪: లోపలకి ప్రవేశపెట్టు పద్దతిని (ఇన్ పుట్, input) యూనికోడ్ [unicode] కి మార్చి, uxxxx లేదా Uxxxxxxxx గాని ప్రవేశపెట్టండి, x అనునది ఇక్కడ షష్ట్యాంశ మానము లోని అంకె

ప్రశ్న౧౫: వైయుడిట్ ఎలా వెతుకుట మరియు మార్చుట ప్రమేయములు చేయగలదు? 
జవాబు౧౫: కమాండు గీత లోన replace పాత_వచనము కొత్త_వచనము అని టైపు చేసి ప్రతి మార్పునకు ఎంటరు కీ నొక్కండి. 
ప్రశ్న౧౬: నేను చేతి వ్రాత పద్దతి ఎలా ఉపయోగించగలను? 
జవాబు౧౬: నీలి రంగు బాణపు (లోపలికి పంపించు పద్దతి input method)పై నొక్కి ఒక కీ ని freehand (ఫ్రీ హ్యాండు ) కి జత చెయ్యగలరు. 

ప్రశ్న౧౭: నేను వాక్యవిన్యాస (syntax) ప్రతేకముగా చూపడాన్ని ఎలా ఆపగలను? 
జవాబు౧౭: కమాండు ప్రదేశము నుండి 'syntax none' అని టైపు చెయ్యడము ద్వారా మీరు ఆపుచెయ్యగలరు. అలాగే మీరు 'syntax' అని టైపు చేసిన తిరిగి పొందవచ్చు. దీనిని కాన్ఫిగ్ ఫైలు లో కూడా చెయ్యవచ్చు. 

ప్రశ్న౧౮: నేను పదాలు స్వయముగా లైనులు గా మరడము ఎలా ఆపు చెయ్యగలను? 
జవాబు౧౮: కమాండు ప్రదేశము లోన 'wordwrap false' అని టైపు చేయ్యడము ద్వారా ఆపు చెయ్యగలరు. అలాగే 'wordwrap true' అని టైపు చెయ్యడము ద్వారా మరళ మొదలు పెట్టగలరు. 

ప్రశ్న౧౯: ఈ తెలుగు అనువాదము లో తప్పులు ఉన్న ఏమి చెయ్యాలి? 
జవాబు౧౯: పైన తెలపబడిన అనువాదకుడి కి ఈ ఉత్తరము వ్రాయగలరు. దయచేసి ఈ పదము బాగా లేదు అని వ్రాయకండి, మరొక పదము సూచించండి. 

అనుబంధము
========
౧.౧. కీ మ్యాపు ఉదాహరణలు: 
ఈ క్రిందవి కొన్ని Telugu-Rts  (తెలుగు ఆర్ టి యస్ ) ఉదాహరణలు 
amma అమ్మ 
aavu ఆవు
illu ఇల్లు 
Iga ఈగ
telugu తెలుగు 
AMdhrapradESu  ఆంధ్రప్రదేశు


END

Gáspár SINAI
Tokyo, 2023-02-11

Made With Yudit Valid XHTML 1.0 Strict Valid CSS!